బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండో వారెంట్ జారీ..! 1 d ago
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ (ఐసీటీ) సోమవారం మరో వారెంట్ జారీ చేయడం జరిగింది. ఈ వారెంట్‌లో ఆమెతో పాటు 12 మంది వ్యక్తుల పేర్లను కూడా చేర్చారు. దేశంలో పలువురి అదృశ్యాలు, హత్యలకు సంబంధించి ఈ వారెంట్ ను జారీ చేశారు. వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువును ప్రకటించింది.